ఏపీ రాజకీయాలపై మంచు లక్ష్మి కామెంట్స్

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మొన్నటి వరకు ఒకెత్తు..ఇప్పుడు ఒకెత్తుల మారిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్..పవన్ కళ్యాణ్ పొత్తు ఫిక్స్ చేయడం..చంద్రబాబు సినీ , రాజకీయ ప్రముఖుల మద్దతుతో పాటు అన్ని రాష్ట్రాలలో యువత , ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి మద్దతు తెలుపుతుండడంతో చంద్రబాబు పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది.

తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో రెండు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబం మోహన్‌ బాబు పెద్ద కోడలికి బంధువులు, చిన్న కోడలు కుటుంబం టీడీపీ తరుఫున వారు. ఈ క్రమంలో మంచువారి కుటుంబం ఎటువైపు నిలుస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని పవన్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో మంచు లక్ష్మీ వావ్..ఇప్పుడు ఏపీ రాజకీయాలు మజా వచ్చేలా ఉన్నాయి..రసవత్తరంగా ఉన్నాయన్నట్లుగా ఆమె ట్వీట్‌ వేసింది. ఈ ట్వీట్‌ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మంచు లక్ష్మీ పెట్టిన ట్విట్‌ కి ..కొందరు నెటిజన్లు…” మీరు కూడా జంప్‌ చేసే టైం వచ్చింది..ముందు మీరు ఏ గట్టు మీద ఉంటారో చెప్పండి మేడం..అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.