సీఎం జగన్ ఫై వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ ఫై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవడానికి ఆయన భార్య భువనేశ్వరి వెళ్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని అనిత మండిపడ్డారు. గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ను తన భార్య కలవకుండా పోలీసులు అడ్డుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పవన్‌ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జైల్లో ఖాళీగా ఉన్న చంద్రబాబు రానున్న రోజుల్లో ప్రజల కోసం ఇంకా ఎన్నో పథకాలు సృష్టిస్తారని అనిత వెల్లడించారు. దానిని ఇప్పుడు ఎగిరి ఎగిరి పడుతున్న వైస్సార్సీపీ నేతలు చూస్తుంటారన్నారు. ఈ రౌడీ, ఫ్యాక్షన్‌ పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఆమె.. జగన్‌ పాలనలో ప్రజలు ఎన్నో అవమానాలుకు గురయ్యారన్నారు. కొత్త కొత్త స్కీమ్‌లతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.