ప్రధాని మోడీకి అరుదైన గౌరవం..

ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌ హిరోషిమాలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌ను ముగించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ముందుగా పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మోడీకి ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది.

ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత గౌరవాన్ని ఫిజీ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. ఫిజియేతరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ పురస్కరాన్ని అందుకోవడం విశేషం. కాగా.. వారిలో ప్రధాని మోడీ ఉన్నారు.