రేపు చంద్రబాబు ను కలవబోతున్న రజనీకాంత్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను CID అధికారులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైలు కు వెళ్లిన దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా..ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. అలాగే సినీ , రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో రేపు సూపర్ స్టార్ రజనీకాంత్..రాజమండ్రి జైల్లో చంద్రబాబు ను కలవబోతున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్టుపై రజనీకాంత్ స్పందించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్‌కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు నేరుగా బాబు ను కలిసి ధైర్యం చెప్పబోతున్నారు.