జగిత్యాలలో కాల్పుల కలకలం

మేనమామను కాల్చిన అల్లుడు

Man open firing
Man open firing

జగిత్యాల: తెలంగాణలో దారుణ ఘటన చోటు చుసుకుంది. జగిత్యాల జిల్లా ఇస్‌రాజ్ పల్లెలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన పేట గీతికకు, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం కు చెందిన పాట శ్రీనివాస్ తో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. అయితే ఇటీవల భర్త శ్రీనివాస్ తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. దీంతో గీతిక భర్త ప్రవర్తనతో విసిగి కొడుకును తండ్రి వద్దే వదిలి… కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం మరో వ్యక్తితో కలిసి ఇస్ రాజ్ పల్లి వెళ్లిన శ్రీనివాస్… భార్య గీతికను చంపేందుకు ప్రయత్నించాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న గీతిక మేనమామ బైరం రాజిరెడ్డి అడ్డు రావడంతో ఆయనకు బుల్లెట్లు దిగాయి. ఆయన కడుపులో, కుడిచేతికి బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు.అయితే భారీ శబ్దం రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి రాజిరెడ్డిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/