49వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

Amaravati- Protestors
Amaravati- Protestors

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటు రైతులు చేసున్న ఆందోళనలు ఈరోజుకు 49వ రోజుకు చేరుకున్నా‌యి. నేడు మంగ‌ళ‌గిరి నుంచి తెనాలి వ‌ర‌కు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి బైక్ ర్యా‌లీ నిర్వ‌హించ‌నుండ‌గా.. మ‌ధ్యా‌హ్నం 2 గంట‌ల‌కు ఈ ర్యా‌లీలో టిడిపి అధినేత చంద్ర‌బాబు పాల్గొ‌న‌న్నా‌రు. ఈ సంద‌ర్భంగా తెనాలిలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి త‌ల‌పెట్టి‌న భారీ బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొ‌ని ప్ర‌సంగించ‌నున్నారు. అటు రాజ‌ధాని గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్ష‌లు కొన‌సాగుతున్నా‌యి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/