బీజేపీ ఒక జూటా పార్టీ అని కామెంట్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ పర్యటన లో ప్రధాని మోడీ టీఆరఎస్ పార్టీ ఫై , సీఎం కేసీఆర్ పాలన ఫై పలు వ్యాఖ్యలు చేయడం పట్ల టీఆరఎస్ నేతలు మండిపడుతున్నారు. మీడియా సాక్షిగా ప్రధాని మోడీ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పలు కామెంట్స్ చేయగా..తాజాగా కార్మిక శాఖ బీజేపీ ఒక జూటా పార్టీ అని అన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని, బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు.
కేసీఆర్ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దసరా రోజు భద్రకాళిని కేసీఆర్ దర్శించుకుంటారు.అమ్మవారికి మొక్కి దేశ రాజకీయాల కోసం బయల్దేరుతారని చెప్పారు. ఆ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆయన సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను బీట్ చేసే మగాడు ఎవరూ లేరని మల్లారెడ్డి పేర్కొన్నారు.