త్వరలోనే తెలంగాణాలో టెట్ పరీక్షలు : మంత్రి సబితా రెడ్డి

Sabitha-Indra-Reddy
హైదరాబాద్:  సీఎం కెసిఆర్  టెట్  నిర్వహించాలని ఆదేశించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. దింతో టెట్ కు సంబంధిచిన చర్యలు త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు. అయితే, ఉద్యోగ అభ్యర్థుల కోసం  అన్ని యూనివర్సిటీలో ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. అలాగే ఇంకో వైపు మన ఊరు మన బడి కార్యక్రమం మీద ఎవరైనా స్కూళ్ల అభివృద్ధి  గురించి వివరాలు ఇస్తే వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు సబితా రెడ్డి చెప్పారు. స్కూళ్ల  ఫీజుల విషయాలపై  ఫీజుల నియంత్రణ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే  నిర్ణయం తీసుంటామని వెల్లడించారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని  తెలిపారు.అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో ఎలాంటి సమస్యలు,ఇబ్బందులు లేవని చెప్పారు. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/