నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్ధుల్లాకు ఈడీ సమన్లు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లాకు ఈడీ నేడు సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో నిధుల దుర్వినియోగం కేసులో ఈ సమన్లు జారీ చేశారు. చండీఘడ్ ఆఫీసులో మే 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే కేసులో గతంలో ఈడీ రెండు సార్లు అబ్దుల్లాను విచారించింది. 2019, 2020లోనూ మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో 2018లో ఓసారి సీబీఐ కూడా అబ్దుల్లాను విచారించింది. జేకే క్రికెట్ సంఘంలో సుమారు 113 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న మాజీ సీఎం ఫారూక్‌ను సరైన రీతిలో పోలీసులు విచారణ చేయలేదని సీబీఐ తన రిపోర్ట్‌లో కోర్టుకు తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/