రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే – మహానాడు వేదికపై బాబు ప్రకటన

రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒంగోలు లో మహానాడు వేడుక కన్నుల పండగగా జరుగుతుంది. వేలాది మంది కార్య కర్తలు , నేతలు హాజరై పార్టీ లో కొత్త ఉత్సహం నింపారు.

ఈ సందర్భాంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తాం. రాష్ట్రంలో సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ISBలో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ISB.. హైదరాబాద్‌కు వచ్చింది. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ఏపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. వైస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రోడ్డు మీదకు రండి… మీకు అండగా మేము ఉంటాం. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే మన పోరాటం. పెట్రోల్‌ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్‌ అన్నీ పెంచేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.