మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కోసం మల్లారెడ్డి ప్రయత్నాలు..

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో..మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే కేసీఆర్ లిస్ట్ రెడీ చేసి పెట్టారని వినికిడి. ఈ తరుణంలో మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను తనకు ఇవ్వాలని మల్లారెడ్డి కోరుతున్నారు.

ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమైన మల్లారెడ్డి..బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పనిచేశానన్నారు. ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని, ఈసారి గతం కంటే ఎక్కవ లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి కేసీఆర్ మల్లారెడ్డి కి టికెట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.