సోషల్ మీడియా లో వైరల్ గా మారిన నయన్ – విఘ్నేష్ హనీమూన్ పిక్స్

ఏడేళ్లుగా ప్రేమాయణం దగ్గరైన నయనతార – విఘ్నేష్ లు తాజాగా వివాహబంధంతో ఒకటయ్యారు. మహాబలిపురంలో ఉన్న షెరటాన్ గ్రాండ్ హోటల్ లో సన్నిహితులు , కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం చాలా అంగరంగవైభవంగాజరిగింది. పెళ్లి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో పంచుకోవడం తో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్​ను ఎంజాయ్ చేస్తున్నారు. థాయ్​లాండ్​లో సరదాగా గడుపుతున్నారు. ఈ మేరకు రొమాంటిక్​ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్​గా మారాయి.

ఇక పెళ్లి తర్వాత ఈ జంట తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన నయనతార మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే కనిపించారు. కానీ నయనతార మాత్రం చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది.దీంతో విఘ్నేశ్ శివన్ క్షమాపణ కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు లెటర్ రాశారు. “అందరికీ చెప్పాలనుకున్నదేంటంటే, మేం తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొన్ని కారణాల రీత్యా అది కుదరక చెన్నైలోనే వివాహం చేసుకున్నాం. వివాహ వేడుక నుంచి స్వామి ఆశీర్వాదం తీసుకునేందుకు నేరుగా తిరుపతికే వచ్చాం. దర్శనం బాగా జరిగింది. గుడి బయట నిలబడి ఫొటో తీసుకోవాలనుకున్నాం. పెళ్లి పూర్తి అయిందని.. ఈ రోజు గుర్తుండిపోయేలా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాం. గుంపు ఎక్కువ అవుతుండటంతో ఆ పరిసరాల నుంచి దూరంగా వచ్చాం”. “భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ ఎంటర్ అయి చెప్పులతోనే వెంటనే ఫొటో తీసుకుని వచ్చేశాం. దేవుడిపై నమ్మకంతో గుళ్లకు రెగ్యూలర్ గా వెళ్లేవాళ్లే దంపతులమే. 30రోజులుగా తిరుమలకు దాదాపు 5సార్లు వెళ్లాం”. “జరిగిన ఘటనను అవమానంగా భావిస్తున్న వారి నుంచి క్షమాపణలు కోరుతున్నాం. ఈ ప్రత్యేక రోజున ప్రతి ఒక్కరి మాకు అందిన ప్రేమ, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ” అని అందులో పేర్కొన్నారు.

ఇక ఈ పెళ్లి వేడుకకు సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరో కార్తి,​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్​, మణిరత్నం, అజిత్​, విజయ్​తో పాటు టాలీవుడ్​, శాండల్​వుడ్​కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.