గుంటూరు కారం సెన్సార్ టాక్..

మహేష్ బాబు , శ్రీలీల , మీనాక్షి చౌదరి జంటగా..త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. అతడు , ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కలయికలో వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కినట్లు ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ చెప్పకనే చెప్పాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో మేకర్స్..సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు.

సినిమాను చూసిన సెన్సార్ యూనిట్ సినిమాకు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా చాల బాగా వచ్చిందని, మహేష్ లుక్ , డాన్స్ , యాక్షన్ ఇలా ప్రతిదీ ఆకట్టుకుంటుందని, శ్రీ లీల మరోసారి తన గ్లామర్ తో డాన్సులతో అదరగొట్టిందని చెప్పుకొచ్చారు. అలాగే చిత్రంలో నటించిన మిగతా నటి నటులంతా కూడా వారి వారి పరిధిలో మెప్పించారన్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ కథకు తగ్గట్లు ఉన్నాయని, థమన్ మరోసారి అదరగొట్టాడని చెప్పుకొచ్చారు. సెన్సార్ టాక్ తో అభిమానుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.