రంజాన్ ప్రార్ధనలు ఇంట్లోనే చేసుకోండి
ఏపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముస్లీం సోదరులు అందరు తమ ప్రార్దనలను ఇంట్లోనే చేసులకోవాలని ఏపి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ కోరారు. నేడు రంజాన్ మాసం సందర్బంగా ముస్లీం సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులలో అధికారులకు సహకరించాలని. తెలపారు. దేశంలోని అన్నిమతాలు, కులాలు వర్గాలకు చెందిన ప్రజల సహకారంతో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/