సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ : రేపటి నుంచి ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్సుపెన్సీ

ఏపీ సినీ ప్రేక్షకులకు , అలాగే చిత్రసీమ కు తీపి కబురు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రేపటి నుండి ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్సుపెన్సీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 14 వ తేదీ నుంచే అమలు చేయనుంది. ఇక ఏపీస సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో… రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది. రేపు మహా సముద్రం, ఎల్లుండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అలాగే.. పెళ్లి సందD సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

కరోనా ఉదృతి నేపథ్యంలో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా ఉదృతి మెల్ల మెల్లగా తగ్గుముఖం పట్టడం తో కరోనా నిబంధనలు పాటిస్తూ 50 శాతం ఆక్సుపెన్సీ తో థియేటర్స్ ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడం తో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ కు పచ్చ జెండా ఊపారు. మరోపక్క రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది.