భారత్‌లో 24,506కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
24 గంటల్లో కొత్తగా 1,429 కేసులు..మొత్తం మరణాల సంఖ్య 775

న్యూఢిల్లీ: దేశలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటలో భారత్‌లో 1,429 కొత్త కేసులు పెరిగాయి. దీంతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. వీరిలో 5,063 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కి చేరుకుంది. మరో 18,668 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/