ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలి

ఢిల్లీ హింసపై స్పందించిన ప్రధాని మోడి

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి ఈశాన్య ఢిల్లీలో అల్లర్లుపై స్పందించారు. ‘శాంతి, సామరస్యాలే మన దేశ లక్షణాలు. ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలని ఢిల్లీలోని నా సోదరసోదరీమణులను నేను కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు. ఢిల్లీలో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనడం చాలా ముఖ్యమని చెప్పారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోన్న హింసపై తాను సమీక్ష నిర్వహించానని మోడి చెప్పారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, భారీగా పోలీసులు మోహరించినప్పటికీ హింస ఆగడం లేదు. రాళ్ల దాడితో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ రోజు చెలరేగిన హింసలో ఓ నిఘా అధికారి కూడా మృతి చెందడం కలకలం రేపుతోంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/