దేశ విస్తృత ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తుంది

సీఏఏలో భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క నిబంధన ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా

muralidhar rao
muralidhar rao

గుంటూరు: దేశ విస్తృత ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. గుంటూరులోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో సీఏఏపై ఎస్సీ, ఎస్టీ, ఎస్టీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఏఏలో భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క నిబంధన ఉన్నా తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మురళీధర్‌రావు సవాల్‌ విసిరారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రాంతాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయడం బిజెపి గొప్పతనమన్నారు. రామజన్మభూమి ట్రస్టులో దళితులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని మోడీ పట్టుబట్టి నియమించారని గుర్తు చేశారు. భారత దేశ అభివృద్ధిలో దళితులు లేకుండా ఏమీ జరగదని బిజెపి గట్టిగా నమ్ముతుందన్నారు. బిజెపిని ప్రధాని మోడీని ఎదుర్కోలేక దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రతిపక్ష పార్టీలు హింసను ఎగదోస్తున్నాయని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ ఆరోపించారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు హింసను ప్రేరిపించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/