టీడీపీ లోకి మహాసేన రాజేష్..ముహూర్తం ఫిక్స్

రాబోయే ఎన్నికలను టార్గెట్ గా చేసుకున్న టీడీపీ పార్టీ ఇప్పటి నుండే కీలక వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే టీడీపీ ని కాదని గత ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ లో చేరిన వారికీ తిరిగి రావాలంటూ ఆహ్వానాలు పంపిస్తున్నట్లు తెలుస్తుంది. పలువురు ఆలా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. తాజాగా ఇక ఇప్పుడు మహాసేన రాజేష్ సైతం టీడీపీ లో చేరబోతున్నారు. ఈ నెల 16 న అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నాడు రాజేష్.

జర్నలిస్టుగా, వ్యాఖ్యతగా రాజేష్ కు మంచి పేరుంది. మహాసేన జర్నలిస్టుగా రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితం. గత ఎన్నికల్లో సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరి..వైస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడ్డాడు. ఆ తర్వాత పార్టీతో విబేధాలు రావడంతో బయటికొచ్చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ పార్టీకి దగ్గర అవ్వడం , జనసేన కార్య కర్తల మనసు గెలుచుకోవడం జరిగింది. ఆ మధ్య జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. ఏం జరిగిందో తెలియదు కానీ.. జనసేనతో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఇక ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వెళ్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. అయితే రాజేష్ జనసేన పార్టీ ని కాదని టీడీపీ లోకి వెళ్లడం ఫై జనసేన కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.