పవన్ కళ్యాణ్ జీవితంపై పుస్తకం విడుదల చేసిన నాగబాబు

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై యువ రచయిత గణ రాసిన ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని శనివారం విడుదల చేసారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు అయితే కోట్లమందికి సాయం చేయగలనని భావించాడని, అవినీతిపరులను, లంచగొండులను ప్రశ్నించడానికి పవన్ పార్టీ పెట్టాడని తెలిపారు. ఈ పుస్తకం ఏకబిగిన చదించింది. శ్రీకాంత్రిష అద్భుతమైన చిత్రాలు గీశారు. గణ అద్భుతంగా రాశారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది. కళ్యాణ్ బాబు గ్రేట్ మోటీవెటర్. తన దగ్గర వున్నది ఇచ్చేయడమే కళ్యాణ్ బాబుకి తెలుసు. కళ్యాణ్ బాబు ఆలోచన ధోరణి చిన్నప్పటి నుండే భిన్నంగా వుండేది. సినిమాలకి రాకముందే కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావని అన్నయ్య అడిగితే ” క్యాలిటీగా వుండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు” అన్నాడు. తను హీరో అయిన తర్వాత కూడా ఇదే పాటిస్తున్నాడు. ఎదుటి వాడి బాధలో వుంటే తను హాయిగా ఉండలేడు. రుద్రవీణ అన్నయ్య చేసిన సూర్యం పాత్ర రియల్ లైఫ్ లో కళ్యాణ్ బాబుది అన్నారు.

పవన్ కల్యాణ్ టీడీపీలోనో, బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశాడని వెల్లడించారు.