బస్సులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్

బస్సులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్

మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‎కు చెందిన బస్సు డ్రైవర్..అదే బస్సులో ఉరేసుకొని చనిపోవడం తో తోటి సభ్యులు షాక్ కు గురైయ్యారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమ్నర్ డిపో వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సుభాష్ టెలోర్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‎ లో విధులు నిర్వహిస్తుంటాడు.

పఠార్ది నుంచి నాసిక్ వరకు బస్సు నడిపేవాడు. అయితే విధులలో భాగంగా టెలోర్ మంగళవారం ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ్నర్ డిపోలో నైట్ హాల్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలోర్.. బస్సులోనే ఒక రాడ్‎కు ఉరేసుకొని చనిపోయాడు. మరుసటి ఉదయం గమనించిన తోటి సిబ్బంది.. వెంటనే ఫై అధికారులకు తెలిపారు. గతంలోను మహారాష్ట్రలో బస్సు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కమలేష్ బెడ్సే (44) అనే డ్రైవర్ అప్పులు మరియు తక్కువ జీతం కారణంగా ధూలేలో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.