బిగ్ బాస్ 5 : రవి ‘డబుల్ గేమ్’ యవ్వారం బట్టబయలైంది..ఈ దెబ్బతో రవి ఇంటికే

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి ఎంట్రీ అయ్యింది. సోమవారం జరిగిన నామినేషన్ లలో ప్రియా – లహరి – రవి ల మధ్య పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. మిడ్ నైడ్ వాష్ రూంలో రవి, లహరి హగ్ చేసుకున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ప్రియ. తామిద్దరి మధ్య ఉన్నది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే.. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి.. ఇలాంటి కామెంట్స్ చేస్తే చూసేవాళ్లు ఏమనుకుంటారు అంటూ రవి, లహరి సీరియస్ అవడంతో ప్రియ మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పింది.

వివాదంలో ప్రియపై విమర్శలు వచ్చినప్పటికీ యాంకర్ రవి డబుల్ గేమ్ ఆడుతున్నాడని తాజాగా బయటపడింది. తాజాగా నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. నిన్న జరిగిన గొడవపై రవి, లహరి, ప్రియలు డిస్కస్ చేస్తున్నారు. రవి దగ్గరకు వచ్చిన లహరి.. ‘నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నా.. అందుకే నీ హెల్ప్ కోసం నీ వెనుక పడుతున్నా.. హౌస్‌లో పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ లహరి నా వెనుకే పడుతుంది.. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అని ప్రియగారితో మీరు అన్నారట నిజమేనా? అని అడిగింది లహరి. అయితే ప్రియ దగ్గరకు వచ్చిన యాంకర్ రవి.. ‘అక్కా నేను ఆ మాట అనలేదు. సింగిల్ మెన్ అనే మాట నా నోటి నుంచి రాలేదక్కా.. పెళ్లి అయినవాళ్లు పెళ్లి కాని వాళ్లు అనే మాట వాడలేదక్కా’ అని అనేశాడు. అయితే ప్రియ మాత్రం ‘ఏడుస్తూ.. నువ్ అన్నావ్ బ్రో.. ఆ మాట అన్నావ్’ అని తెగేసి చెప్పింది.

రవి క్లియర్‌గా లహరి గురించి బ్యాడ్‌గా ప్రియకి చెప్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇందులో రవి.. లహరి తన వెంటపడుతుందని చెప్పడం.. సింగిల్ మెన్ అనే పదాన్ని వాడటం క్లియర్‌గా తెలుస్తుంది. ‘ఈ సీజన్ అయిపోయిన తరువాత లహరి యాంకర్‌గా ట్రై చేస్తుంది.. అందుకే నా హెల్ప్ కోసం నా వెంటపడుతుంది. హౌస్‌లో పెళ్లికాని ఉన్నప్పటికీ ఆమె నాతోనే ఉంటుంది.. అది ఆమె మిస్టేక్ అని నేను అనను.. నాతోనే కలిసి తింటుంది.. బ్యాటరీస్ మార్చుకోవడానికి నాతోనే వస్తుంది.. తనకి నేను చెప్పలేకపోతున్నా’ అని ప్రియ దగ్గర లహరి గురించి చెప్పాడు. ఇలాంటివి చెప్పలేం కానీ.. లిమిట్స్ దాటితే ఏం చేస్తాం అని అన్నది ప్రియ.

యాంకర్ రవి.. లహరి తన వెంటపడుతుందని.. పెళ్లైన వాళ్లని వదిలేసి నాతోనే ఉంటుందని.. ఆమె యాంకరింగ్ కోసమే ఇలా చేస్తుందని సింగిల్ మెన్ అనే పదాన్ని వాడాడు. అయితే నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో మాత్రం.. నేను సింగిల్ మెన్ (పెళ్లికాని వాళ్లు) అనే మాటను వాడలేదు అక్కా అని బుకాయిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ వీడియోతో అటు ప్రియతో చెప్పిందంతా చెప్పి.. లహరిని బ్యాడ్ చేయడమే కాకుండా.. ఇప్పుడు నేను అలా అనలేదని అడ్డంగా బుక్ అయిపోయాడు రవి. దీంతో నెటిజన్లు రవిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ వీడియో చాలు రవి ఏ రేంజ్ లో డబల్ గేమ్ ఆడుతున్నాడని కొంతమంది అంటుంటే..ఈ దెబ్బ తో రవి హౌస్ నుండి బయటకు వెళ్లడం ఖాయమని మరికొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది శనివారం నాగ్..రవి కి గట్టి క్లాస్ పీకడం గ్యారెంటీ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి రవి ఇలా ప్రవర్తించడం ఆయన అభిమానులకు నచ్చడం లేదు.

Evaru jarigindi chepparu? Evaru kalpinchi chepparu?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/PoUvN2es1U— starmaa (@StarMaa) September 21, 2021

Lol 😂😂😂#BiggBossTelugu5 https://t.co/vAyUID78MD pic.twitter.com/TB0edqWllg— S. (@sahithi_123) September 21, 2021