ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత..

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత..

ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు కిలోమీటర్ల వరకు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి సీతక్క వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయంకు చేరుకోగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి సీతక్క పడిపోయారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.

సీతక్క స్పృహ‌త‌ప్పి పడిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే బీపీ డౌన్ అయినందువల్లే సీతక్క పడిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఎండలో నడవడం వల్లే సీతక్క సొమ్మసిల్లి పడిపోయినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.