మెగా పవర్ స్టార్ బర్త్ డే రోజున మెగా మూవీస్ రీ రిలీజ్

ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా తో పాటు..ఆరెంజ్ మూవీస్ ను రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ స్పెషల్ రీ-రిలీజ్ ల ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్ డ్రైవ్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఇక ఇండస్ట్రీ హిట్ గా మగధీర నిలిస్తే. ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాప్‌లలో ఒకటి గా ఆరెంజ్ ఉంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కియారా అద్వానీ , అంజలి హీరోయిన్లు గా నటిస్తుండగా..చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.