నేడు భారత్‌ కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

న్యూఢిల్లీ: నేడు భారత్‌, రష్యా దేశాల అధినేతలు సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ వేదికవనుంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నేడు ఢిల్లీకి రానున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోడీ తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 200 హెలికాప్టర్ల తయారీ అంశంపై కూడా అవగాణ కుదుర్చుకోనున్నాయి. రాత్రి 9.30 గంటలకు పుతిన్‌ రష్యాకు తిరుగు పయనమవుతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/