ఏపీలో దంచికొడుతున్న వర్షాలు

ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి ఏర్పడడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు పడనున్నాయి. ఈరోజు ఉదయం నుండే తెలంగాణ తో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. భారీ వర్షాలు, పిడిగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ సూచించింది. అల్లూరి జిల్లా అరకులోయలో గంటకు పైగా ఉరుములతో భారీ వర్షం కురిసింది.

రేపు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శనివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇటు తెలంగాణ లోను పలుచోట్ల వడగండ్ల వర్షం పడింది. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలం బడంపేట్, మనియార్ పల్లిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. .