అభివృద్ధి ప్రదాత ఎవరో అర్థమైందా రాజా?!

‘యువగళం’ పాదయాత్ర నుండి నారా లోకేష్ పోస్ట్

Lokesh selfie infront of Kia car showroom in Bhimavaram
Lokesh selfie infront of Kia car showroom in Bhimavaram

అమరావతి: ఇది భీమవరంలోని కియా కార్ల షోరూమ్. దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను రప్పించి, ఉద్యోగాల పంట పండించారు దార్శనికత నేత చంద్రబాబునాయుడు. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేలమంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించాయి. 51నెలల జలగన్న పాలనలో చేసిందేమిటి? ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ, లులూ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశాడు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాక చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టించాడు. అభివృద్ధి ప్రదాత ఎవరో, విధ్వంసకపాలనతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది ఎవరో అర్థమైందా రాజా?! అంటూ లోకేష్ పోస్ట్ చేశారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/category/telangana/