ఏపీ ప్రభుత్వం పవన్ పుట్టినరోజును టార్గెట్ చేసి ఫ్లెక్సీలపై నిషేధం విధించింది – వంగలపూడి అనిత

AP Telugu Mahila president Vangalapudi Anitha
AP Telugu Mahila president Vangalapudi Anitha

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రీసెంట్ గా విశాఖపట్నం పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖపట్నం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని, 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన పట్ల టీడీపీ పలు ఆరోపణలు చేస్తుంది.

సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును టార్గెట్ చేసి ఫ్లెక్సీలపై నిషేధం విధించారని ఆరోపిస్తుంది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్లెక్సీ బ్యాన్ ఫై స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానే అవుతుందా అని ప్రశ్నించారు. ట్విట్టర్ ద్వారా ‘‘ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వరకు ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?’’ అని ట్వీట్ చేసారు. మరి అనిత అన్నట్లు జరుగుతుందా..లేక అలాగే బ్యాన్ కొనసాగుతుందా అనేది చూడాలి.