బ్యాండేజ్ బబ్లూ అంటూ జగన్ ఫై లోకేష్ సెటైర్లు

సీఎం జగన్ ఫై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన నుదిటిన చిన్న గాయమైంది. దానికి ఆయన దాదాపు 15 రోజులు బ్యాండేజ్ తిరిగారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడం తో రీసెంట్ గా బ్యాండేజ్ ను తీసేసారు. దీనిపై కూడా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు జగన్ భారీ బ్యాండేజ్ తో కనిపించి ఇప్పుడు దాన్ని తీసేసారే..అసలు అక్కడ గాయమే లేదు కదా..ఎందుకు బ్యాండేజ్ వేసుకున్నారబ్బా అంటూ మాట్లాడుకోవడం , సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

దీనిపై లోకేష్ మొదటి నుండి సైటర్లు వేస్తూ వస్తున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన యువగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఇటీవలి వరకు సీఎం జగన్ నుదుటన బ్యాండేజితో తిరగడంపై వ్యంగ్యం ప్రదర్శించారు. “నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది. దాని పేరు బ్యాండేజ్ బబ్లూ. యాక్టర్ ఎవరో తెలుసా… జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా… భారతీరెడ్డి గారు! డైరెక్షన్ మొత్తం ఐప్యాక్! ఇప్పటికే భాస్కర్ అవార్డులు కూడా వచ్చేశాయి! తొందర్లో ఆస్కార్ అవార్డు కూడా ఖాయం!” అంటూ ఎద్దేవా చేశారు.