సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అంటూ జగన్ కు లోకేష్ కౌంటర్

lokesh-comments-on-jagan-and-sajjala

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. దీనికి కౌంటర్ గా లోకేష్..ఈరోజు శంఖారావం కార్యక్రమంలో మాట్లాడుతూ.. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని స్పష్టం చేశారు. ఇక, గ్లాసును ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనని అన్నారు. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగుల జగన్ ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికొస్తుందని విమర్శించారు.

ఏపీలో బాదుడే బాదుడు… తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు, మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు… ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్ ది… రేపో మాపో చెత్తపై కూడా పన్ను వేస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.