రెండు మూడు రోజుల్లోగాంధీ ఆసుపత్రికి వస్తాః మెగాస్టార్​ చిరంజీవి

‘అడవి దొంగ’ సినిమా చూస్తూ ఆపరేషన్ చేయించుకున్న మహిళ

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్ః సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని స్పృహలోనే ఉంచి సినిమా చూపిస్తూ అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులోని కణతిని తొలగించారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూశారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

విషయం తెలిసిన చిరంజీవి వెంటనే స్పందించారు. వివరాలు తెలుసుకోమంటూ నిన్న తన పీఆర్వో ఆనంద్‌ను ఆసుపత్రికి పంపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును కలిశారు. ఈ సందర్భంగా మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఆయన పరిచయం చేశారు. అనంతరం ఆనంద్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను కలిసి మాట్లాడారు.

తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలను క్రమం తప్పకుండా చూస్తానని ఆమె చెప్పారు. అనంతరం ఆనంద్ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. చిరు స్పందిస్తూ.. వీలు చూసుకుని రెండుమూడు రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆనంద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/