జగన్‌ పాలనలో నేరాల్లో రాష్ట్రం ప్రథమస్థానం : లోకేష్

lokesh

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సిఎం జగన్‌ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవలంభిస్తున్న విధ్వంస పాలన దుష్ఫలితాల ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని లోకేశ్‌ ఆరోపించారు. నేరాలు-ఘోరాల గణనీయవృద్ధిలో జగన్ ఏ వన్‌ నిరూపించుకున్నారని విమర్శించారు. మూడేళ్లలో ఆర్థిక నేరాల కేసులు 9,273కు పెంచడం ఆయన ప్రతిభకు నిదర్శనమని అన్నారు. దేశద్రోహం కేసుల నమోదులో ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే దేశద్రోహం కేసులు బనాయిం చారని తెలిపారు. విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రిజనరీ జగన్‌ పాలనలో నేరాల్లో ప్రథమస్థానం సాధించారని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/