గణపతి మండపంలో పవన్ కళ్యాణ్ కు హారతులు

దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో గణనాధుని కొలుస్తున్నారు. కాగా ఇక్కడ ఓ పవన్ అభిమాని గణేష్ మండపంలో పవన్ కళ్యాణ్ కు హారతి ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్లాదిమంది అభిమానులే కాదు ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారనే సంగతి చెప్పనవసరం లేదు. సినిమాలు చూసి హీరోలకు అభిమానులు ఉంటె..పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆయన వ్యక్తిత్వం నచ్చి అభిమానులు అయ్యారు. సామాన్య ప్రేక్షకుల నుండి సినీ ప్రముఖుల వరకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారు. ఇక ఆయన నుండి సినిమా వస్తుందంటే పెద్ద పండగలా భావిస్తారు. వారం ముందు నుండే థియేటర్స్ ను ముస్తాబు చేయడం..భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడం..పాలాభిషేకాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తే చాలు..పలు సేవ కార్య క్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు ఆ ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు.

కాగా ఇక్కడ ఓ అభిమాని పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని హారతి రూపంలో చూపించాడు. గణేష్ విగ్రహం ముందు పవన్ కళ్యాణ్ ఫోటో కు హారతి ఇస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.