రెండో రోజు లోకేష్ CID విచారణ ఎలా సాగిందంటే..

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా సిట్ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రెండో రోజు కూడా విచారించారు. తాడేపల్లిలోని SIT కార్యాలయంలో విచారణ జరిగింది. IRR allignment మార్పు కేసులో లోకేష్‌ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్‌ను CRPCలోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది.

రెండో రోజు దాదాపు 47 ప్రశ్నలు అడిగారు అవి కూడా నిన్న అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని , వాషింగ్ మిషన్ లో వేసి తిప్పినట్టుగా మంగళవారం అడిగిన ప్రశ్నలే తిట్టి తిప్పి అడిగారని లోకేష్ మీడియా తో తెలిపారు. సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారు. సీఐడీ కొత్తగా ఏమీ అడగలేదు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు. ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 2 రోజుల పాటు నా సమయం వృథా చేశారు.” అని లోకేశ్‌ అన్నారు.

“భువనేశ్వరి డాక్యుమెంట్స్‌ ఎలా అడుగుతారు?. ఇన్నర్‌ రింగ్ రోడ్‌పై బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్‌ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌తో నాకు సంబంధం లేదు. ఇన్నర్‌ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డిపై FIR ఎందుకు పెట్టలేదు?. అజేయ కల్లాం, ప్రేమ్‌చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ ఆడిటర్‌ను అడగమని చెప్పా. రెంట్ చెల్లిస్తే క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుంది?. విచారణకు సహకరించలేదని కొన్ని పత్రికలు రాసిన వార్తలపై సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ కేసులో మరోసారి లేక ఇస్తారా అని దర్యాప్తాధికారిని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదని లోకేష్ వివరించారు.