పాలేరు నుండి షర్మిల..సికింద్రాబాద్ నుండి విజయమ్మ..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 03 న ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..గులాబీ బాస్ కేసీఆర్ అక్టోబర్ 15 నుండి ప్రచారం మొదలుపెడుతున్నారు. ఇక కాంగ్రెస్, బిజెపి పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది.

ఈ క్రమంలో YSRTP ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లో YSRTP ని విలీనం చేయాలనీ అనుకుంది. కానీ అది కుదరకపోవడం తో ఇక ఒంటరిగా పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యింది. మొత్తం 100 సీట్లలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలోకి దించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. రెండు చోట్ల నుంచి షర్మిల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా పాలేరు, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి షర్మిల పోటీ చేయనున్నారు.

షర్మిల తల్లి విజయమ్మ (YS Vijayamma) కూడా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి వైఎస్‌ విజయమ్మ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ చీల్చడమే టార్గెట్‌గా షర్మిల పార్టీ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. దీనిపై రేపు జరగబోయే పార్టీ కీలక సమావేశంలో తెలుస్తుంది.