విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ సమావేశం

Loksabha today-

New Delhi: లోక్‌సభ సమావేశం విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య కొనసాగుతోంది. బిజెపి ఎంపి అనంత్‌కుమార్‌ హెగ్డే మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారు. ఇప్పటికే సభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమైంది. అయినప్పటికీ హెగ్డే వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌ పక్ష నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌధురి అధికార సభ్యులను తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలేమీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/