జీ20 సదస్సు లో పలకరించుకున్న మోడీ, సునాక్ లు

భారత్, బ్రిటన్ ల మధ్య రేపు ద్వైపాక్షిక చర్చలు

britain-pm-rishi-sunak-greets-pm-modi-in-g20-summit

బాలిః భారత సంతతికి చెందిన నేత రిషి సునాన్‌ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరు అవగా ఈ క్రమంలో తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో రిషి సునాక్ భేటీ అయ్యారు. తొలి రోజే మోడీతో రిషి సునాక్ కలిశారు. అధికారిక చర్చల కోసమేమీ మోడీ, సునాక్ భేటీ కాలేదు. భేటీకి హాజరైన రిషి సునాక్… మోడీ కనిపించగానే… ఆయన వద్దకు వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.

వాస్తవానికి జీ20 సదస్సులో భాగంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ తమ దేశాల అధికార ప్రతినిధులతో కలిసి మోడీ, సునాక్ పాలుపంచుకోనున్నారు. అయితే ఒకే దేశానికి చెందిన నేతలు కావడంతో వీరిద్దరూ తొలి రోజే తారసపడిన సందర్భంగా పలకరించుకున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్…భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే బ్రిటన్ ప్రధానిగా సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టగానే…భారత్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/