నా హక్కుల ఉల్లంఘన జరిగింది : జయదేవ్‌

TDP Member Galla Jayadev

New Delhi: టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్‌ లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ అమరావతిలో తనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై లోక్‌సభలో ఎండగట్టారు. ఎంపిగా తన హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పారు. అమరావతి రైతులతో కలిసి తాను చలో అసెంబ్లిలో పాల్గొన్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు. మహాత్మా గాంధీపై బిజెపి సభ్యుడు హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే జయదేవ్‌ మాట్లాడారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/