రేపు కాంగ్రెస్ తొలి లోక్ సభ సభ్యుల జాబితా..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తొలి జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిపోవడంతో రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి బరిలో దిగాలని రాష్ట్ర నేతలు కోరినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ ఇప్పటికే కసరత్తు చేసింది.

మరోపక్క బిజెపి ఇప్పటికే 195 మందితో కూడిన మొదటి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 28 మంది మహిళలకు స్థానం కల్పించారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పేర్లను ఖరారు చేసింది. గాంధీ నగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. జాబితాలో 36 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 57 మంది ఓబీసీలకు చోటుదక్కింది. ఉత్తరప్రదేశ్‌లో 51, గుజరాత్ లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.