బీఆర్ఎస్కు కోనేరు కోనప్ప రాజీనామా

బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరగా ..తాజాగా మాజీ ఎమ్మెల్యే , కొమురం భీం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోనేరు కోనప్ప ఇదే పార్టీకి రాజీనామా చేసారు. ఈయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పార్టీలో చేరికను కోనేరు కోనప్ప ఖరారు చేసుకోనున్నారు. సిర్పూర్ నియోజకవర్గం లోని ప్రధాన నాయకులతో కలిసి సీఎంను కలుస్తారని చెబుతున్నారు. జడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ తో పాటు, పలువురు ముఖ్య నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిగాయని కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉండాలని కోనప్ప వారికి చెప్పారని అంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప..పార్టీకి రాజీనామా చేసినట్లు చెపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. తమను ఓడించిన వారితో ఏలా పని చేస్తామని కోనప్ప అన్నారు. పొత్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోనప్ప బాటలోనే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది.