ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

AP High Court orders suspending ZPTC, MPTC elections
AP High Court orders suspending ZPTC, MPTC elections

Amaravati: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు లో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది.

ఏప్రిల్ ఒకటవ తేదీన ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్ , తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/