ప్రధాని మాట వినండి..కోహ్లీ
మనకున్న ఏకైక మార్గం అదే..

ముంబయి: జనతా కర్ప్యూలో విజయవంతంగా పాల్గోని, తరువాత ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలను కట్టడిచేయడానికి ప్రధాని మోది 21 రోజులు దేశమంతా లాక్డౌన్ ప్రకటించాడు. ప్రధాని ఇచ్చిన ఈ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ఇంతకన్నా వేరేమార్గం లేదు కాబట్టి దేశమంతా ప్రధాని లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీ ఈ ట్వీట్ చేశాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ లోకి వెళుతుందని గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోది ప్రకటించారు. నా అభ్యర్ధన కూడా అదే. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి అని విరాట్ ట్వీట్ చేశాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/