లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం

వైరస్‌ మీకే సోకిందనుకోండి… న్యూజిలాండ్‌ ప్రధాని

jasinda ardern
jasinda ardern

వెల్లింగ్‌టన్‌: కరోనాతో ప్రపంచం మొత్తం గడగడలాడిపోతుంది. దీని బారి నుండి తప్పించుకునేందుకు దేశాలు అన్ని లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. నిన్న ప్రధాని మోది 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించగా నేడు న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జసిండా అర్డెర్న్‌ కూడా నెల రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో ఒక్క కరోనా మరణం సంభవించనప్పటికీ వ్యాప్తిని కట్టడి చేసేందుకు నాలుగు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించింది. ఒకవేళ వైరస్‌ మీకు సోకితే ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రస్తుతం కూడా అలాగే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/