ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న 277 మంది
ఇరాన్ నుంచి రాక

జోధ్‌పూర్: కరోనా వైరస్ అధికంగా వ్యాపించిన దేశాలలో ఒకటి అయిన ఇరాన్ నుండి నేడు 277 మంది భారతీయులు జోధ్‌పూర్ చేరుకున్నారు. అక్కడ వీరిని నిబంధనల ప్రకారం పరీక్షించిన అధికారులు .. వారిని జోధ్‌పూర్ మిలటరి స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. కాగా ఇందులో 149 మంది మహిళలు ఉన్నారని, అందరికి అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/