గన్ మెన్ పై చేయిచేసుకున్న హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ..వివాదాలకు చాల దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి తాజాగా గన్ మెన్ పై చేయిచేసుకొని వార్తల్లో నిలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసి..ఆయనపై చేయి చేసుకున్నారు. దీంతో షాక్ అయిన సదరు గన్ మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు.

ఆపై వెనక ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఫై నెటిజన్లు మంత్రి మహమూద్ అలీ విమర్శలు చేస్తున్నారు. మంత్రి అయినంత మాత్రాన సిబ్బంది ఫై చేయి చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.