రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొడ‌తామ‌ని హెచ్చరిక

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్‌లో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో కేసీఆర్ ఫై ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ , కేటీఆర్ ఇద్దరిపై మాటల యుద్ధం చేసాడు. కేసీఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే… ఆయన కొడుకు కేటీఆర్‌… డ్రగ్స్‌ తీసుకునే వారికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని రేవంత్ సభ లో వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల ఫై కేటీఆర్ ఫైర్ అయ్యారు.నేను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధమని.. రాహుల్ గాంధీ సిద్ధమా.. ? అని సవాల్ విసిరారు. డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా..నాకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ని పట్టుకొని తాగుబోతు అంటారా.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలకు రాష్ట్రం లో పెద్ద పని లేదని… కేసీఆర్ అభివృద్ధి చూస్తూ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని నిప్పపు చెరిగారు. రేవంత్ కొత్త బిచ్చగాడని… రేవంత్ దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదన్నారు. మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్పా అంత సీన్ లేదని… రూ. 50 కోట్లకు రేవంత్ పిసిసి చీఫ్ పదవి కొనుక్కున్నారు అని వారి పార్టీ నేతలే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ను దూషిస్తే ఊరుకోమ‌ని బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొడ‌తామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటానికి కూడా బీజేపీ మ‌తం రంగు పులుముతోంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త‌మ‌కు అంద‌రి అక్ర‌మ సంపాధ‌న తెలుసున‌ని అన్నీ త్వ‌ర‌లో బ‌య‌ట ప‌డ‌తాయ‌ని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.