అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సిఎం జగన్
చిత్తూరు: ఏపిలో సిఎం జగన్ ఈరోజు చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాక చిత్తూరు పీవీకేఎన్ కళాశాలకు చేరుకుంటారు. కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో అమ్మఒడి పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/