తెలంగాణలో ఒక్కరోజే 1,278 మందికి కరోనా

400కు చేరువైన మరణాల సంఖ్య

తెలంగాణలో ఒక్కరోజే 1,278 మందికి కరోనా
corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతుంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక కొత్త కేసుల్లో 762 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూశాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 339 మంది మృతి చెందారు. నిన్న 1,013 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,205కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 12,680 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,51,109 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, వారిలో 1,18,885 మందికి నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు

రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్ లో 85, సంగారెడ్డిలో 36, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 23, వరంగల్ అర్బన్‌లో 5, వరంగల్ రూరల్‌లో 8, కరీంనగర్‌లో 9, మహబూబాబాద్, పెద్దపల్లిలో ఆరేసి కేసులు, మెదక్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 14, మంచిర్యాలలో 17, నల్గొండలో 32, రాజన్న సిరిసిల్లలో 7, ఆదిలాబాద్‌లో 14, నారాయణపేటలో 9, జనగామలో 3, నిజామాబాద్‌లో 8, సిద్ధిపేటలో 4, సూర్యాపేటలో 14, గద్వాల, ఆసిఫాబాద్, నిర్మల్‌, యాదాద్రి, వనపర్తిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

తెలంగాణలో ఒక్కరోజే 1,278 మందికి కరోనా


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/