రేవంత్‌ సర్కార్ కుప్పకూలబోతుందంటూ పల్లా కీలక వ్యాఖ్యలు

తెలంగాణ లో రేవంత్ రెడ్డి సర్కార్ కుప్పకూలబోతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి తన మార్క్ కనపరుస్తున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి పడిపోతుందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఎన్ని రోజులు పడుతుందో తెలియదు గానీ వచ్చే ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని వాక్యానించారు. తమ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రీసెంట్ గా ఎమ్మెల్యే కడియం సైతం ఆరు నెలల్లో కానీ ఏడాది లోపు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపి షాక్ ఇచ్చాడు. ఇలా వరుసగా బిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.