టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

భక్తుల ద్వారా వైరస్ సోకలేదన్న కలెక్టర్

tirumala temple
tirumala temple

తిరుమల: ఏపిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఈ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తాజాగా, కరోనా బారిన పడిన సిబ్బందికి భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. కాగా, ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన సిబ్బంది అందరినీ హోం క్వారంటైన్‌, ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్సలు అందించామని వెల్లడించారు. భక్తుల ఆరోగ్యమే ధ్యేయంగా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలుచోట్ల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలిపిరి వద్ద, శ్రీవారి ప్రధానద్వారం వద్ద స్ర్పేయింగ్‌ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/